వీకెండ్‌లో బాబు జాడెక్కడ? విషయం తెలిస్తే షాకే‌..!

ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందిన తర్వాత నుంచి ప్రతీ వీకెండ్ హైదరాబాద్ వస్తున్నారు ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు. తొలి రోజుల్లో ప్రతీ వీకెండ్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు వచ్చి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో ఆయన సమావేశం అయ్యేవారు. కానీ గత రెండు వారాలుగా చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ మెట్లెక్కలేదు. మరి ఆయన శుక్రవారం రాత్రి హైదరాబాద్ వచ్చి.. సోమవారం తిరిగి అమరావతి బాట పట్టే వరకు […]

వీకెండ్‌లో బాబు జాడెక్కడ? విషయం తెలిస్తే షాకే‌..!
Follow us

|

Updated on: Nov 25, 2019 | 5:53 PM

ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందిన తర్వాత నుంచి ప్రతీ వీకెండ్ హైదరాబాద్ వస్తున్నారు ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు. తొలి రోజుల్లో ప్రతీ వీకెండ్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు వచ్చి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో ఆయన సమావేశం అయ్యేవారు. కానీ గత రెండు వారాలుగా చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ మెట్లెక్కలేదు. మరి ఆయన శుక్రవారం రాత్రి హైదరాబాద్ వచ్చి.. సోమవారం తిరిగి అమరావతి బాట పట్టే వరకు హైదరాబాద్‌లో ఏం చేస్తున్నారు? ఇదిప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్.

హైదరాబాద్‌లో చంద్రబాబు ఏం చేస్తున్నారు? కొన్ని రోజులుగా వైసీపీ నేతలు వేస్తున్న ప్రశ్న. వీకెండ్‌లో ఆయన షెడ్యూల్‌ ఏంటి? అని అందరు ఆరా తీస్తున్నారు. ఆయన మాత్రం రెండు వారాల నుంచి తన టైమ్‌ టేబుల్‌ మార్చారట. జూబ్లిహిల్స్‌ నుంచి ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వైపు కాకుండా వేరే రూట్లో వెళుతున్నారట. ఇంతకీ చంద్రబాబు ఎటు వెళుతున్నారు? ఏం చేస్తున్నారు?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏపీలో ఉంటున్నారు. జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరుపుతున్నారు. అమరావతిలో ఉంటే పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. ఏపీలో మళ్లీ పార్టీని పట్టాలపైకి తీసుకొ్చ్చే పనిలో చంద్రబాబు బిజీగా ఉంటున్నారు. ఇదంతా మండే టు ఫ్రైడే షెడ్యూలే.

అయిదు రోజుల పాటు ఏపీలో బిజి బిజీగా వుంటున్న చంద్రబాబు.. వీకెండ్ వచ్చిందంటే శుక్రవారం చలో హైదరాబాద్‌ అంటున్నారు. గన్నవరం టు హైదరాబాద్‌ ప్టైట్‌ ఎక్కేస్తున్నారు. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు ఉంటున్నారు. మొన్నటి దాకా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు వచ్చేవారు. తెలంగాణ పార్టీ నేతలతో సమావేశమయ్యేవారు. ఇక్కడ పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించేవారు. అయితే రెండు వారాలుగా చంద్రబాబు షెడ్యూల్‌లో మార్పు వచ్చిందట. వీకెండ్‌ పోగ్రామ్స్‌లో చేంజ్‌ వచ్చాయట. వీకెండ్‌లో ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నారని పలువురు ఆరా తీస్తున్నారు.

శని, ఆదివారాలు చంద్రబాబు హైదరాబాద్‌ హఫీజ్‌పేట్‌లోని ఫామ్‌హాజ్‌కు పరిమితమవుతున్నారట. ఆయన్ని కలవాలంటే అక్కడికి వెళ్ళాల్సిందేనంటున్నారు. కానీ అక్కడ కొంతమందికి మాత్రమే ప్రవేశం ఉంటుందట. మొత్తానికి ఇప్పుడు చంద్రబాబు వీకెండ్‌ ఫామ్‌ హౌజ్‌ మీటింగ్‌లు చర్చనీయాంశంగా మారాయి.

అయితే తెలంగాణలో పార్టీ పరిస్థితి బాగా లేదు. హుజూర్‌నగర్‌లో పోటీ తర్వాత ఇంకా దిగజారింది. దీంతో మళ్లీ ఇక్కడ పార్టీపై దృష్టి పెట్టి…అధికార పార్టీతో శత్రుత్వం పెంచుకోవడం ఎందుకు? అనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు రావడం లేదని అంటున్నారు. ఇక్కడి పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. హైదరాబాద్‌లో తిరిగి గుడ్‌ రిలేషన్స్‌ను సంపాదించుకోవడంలో భాగంగానే చంద్రబాబు ఫామ్‌హౌస్‌కు పరిమితమవుతున్నారట. చంద్రబాబు పాచిక పారుతుందా ? వేచి చూడాల్సిందే.

Latest Articles
శరీరంలో ఈ పార్ట్‌ మసాజ్‌ చేస్తే చర్మం చందమామలా వెలిగిపోతుందట
శరీరంలో ఈ పార్ట్‌ మసాజ్‌ చేస్తే చర్మం చందమామలా వెలిగిపోతుందట
కిషన్‌రెడ్డితో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ స్పెషల్ ఇంటర్వ్యూ
కిషన్‌రెడ్డితో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ స్పెషల్ ఇంటర్వ్యూ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.! నీ క్రియేటివిటీకి..
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.! నీ క్రియేటివిటీకి..
ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోకండి.. బ్రెయిన్‌ క్యాన్సర్‌ కాబోలు
ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోకండి.. బ్రెయిన్‌ క్యాన్సర్‌ కాబోలు
ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్టుతో యువతి సంబరం మామూలుగా లేదుగా!
ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్టుతో యువతి సంబరం మామూలుగా లేదుగా!
గీతా గోవిందం సినిమాలో విజయ్ చెల్లెలు గుర్తుందా ?..
గీతా గోవిందం సినిమాలో విజయ్ చెల్లెలు గుర్తుందా ?..
సమ్మర్‌లో పిస్తా తింటే ప్రమాదమా.? నిపుణులు ఏమంటున్నారంటే..
సమ్మర్‌లో పిస్తా తింటే ప్రమాదమా.? నిపుణులు ఏమంటున్నారంటే..
'ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకో'.. సంజీవ్ గోయెంకాపై షమీ ఆగ్రహం
'ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకో'.. సంజీవ్ గోయెంకాపై షమీ ఆగ్రహం
ఎయిర్‌లైన్‌ విమానంలో మహిళ వింత ప్రవర్తన.. లగేజీ లాకర్లో నిద్ర..
ఎయిర్‌లైన్‌ విమానంలో మహిళ వింత ప్రవర్తన.. లగేజీ లాకర్లో నిద్ర..
మట్టిలో పాతిపెట్టిన చిన్న కుండ.. దొరికిన పురాతన నిధి..
మట్టిలో పాతిపెట్టిన చిన్న కుండ.. దొరికిన పురాతన నిధి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట