ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి రోజు: చంద్రబాబు

EX Cm Chandrababu Sensational Comments On YCP Government, ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి రోజు: చంద్రబాబు

అమరావతిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఛలో ఆత్మకూరుకు బయలుదేరిన టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారాలోకేష్‌ని హౌస్ అరెస్ట్ చేశారు. ఛలో ఆత్మకూరు అడ్డుకోవడం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడం కరెక్ట్ కాదన్నారు. బాధితులకు సంఘీభావంగా అందరూ నిరసనలు తెలపాలని ఆయన అన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని.. ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి రోజు అని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని చంద్రబాబు అన్నారు. ఇలాంటి అరాచకాలు మరలా పునరావృతం కాకుండా చూడాలన్నారు.

పునరావాస శిబిరానికి పంపించే ఆహారాన్ని అడ్డుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. నిరంకుశ పాలనలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని చంద్రబాబు నిలదీశారు. పోలీసుల తీరుకు నిరసనగా రాత్రి 8 గంటల వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులదేనని.. అలాంటి వారే అరెస్టులకు పాల్పడటం దుర్మార్గం అన్నారు. న్యాయం చేయమని అడుగుతున్నందుకు టీడీపీ పై కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పల్నాడు వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *