ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతున్నారు.. బాబు ఆవేదన

అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారంపై స్పందించిన ఏపీ విపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రభుత్వం తమ ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెడుతున్నారన్న చంద్రబాబు... విపక్ష నేతల ఆర్థిక మూలాలను ప్రభుత్వ అధినేతలు టార్గెట్ చేశారని కామెంట్ చేశారు

ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతున్నారు.. బాబు ఆవేదన
Follow us

|

Updated on: Jun 13, 2020 | 4:53 PM

అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారంపై స్పందించిన ఏపీ విపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రభుత్వం తమ ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెడుతున్నారన్న చంద్రబాబు… విపక్ష నేతల ఆర్థిక మూలాలను ప్రభుత్వ అధినేతలు టార్గెట్ చేశారని కామెంట్ చేశారు. శుక్రవారం అరెస్టయి ప్రస్తుతం జ్యూడిషియల్ రిమాండ్‌లో వున్న అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు చంద్రబాబు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అయితే, జ్యూడిషియల్ రిమాండ్‌లో వున్న వ్యక్తిని కలిసేందుకు కోర్టు అనుమతి కావాలని పోలీసులు చెప్పడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ‘‘ అచ్చెన్నాయుడును పరామర్శించటానికి వచ్చాను.. పోలీసులు అనుమతి లేదంటున్నారు.. ఆయన ఆరోగ్య పరిస్థితి బాలేదు.. 15 గంటలు ప్రయాణం చేయించారు.. ఉన్న పళంగా లిఫ్ట్ చేశారు.. ఇళ్ళు కబ్జా చేసి గోడలు దూకి ఇంట్లోకి వెళ్ళారు.. భార్య ఆరోగ్యం బాలేదని చెప్పినా పట్టించుకోలేదు.. ’’ అని వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు కుటుంబం ప్రజలకు సేవ చేసిందని, ఆయన పట్ల ఇలా దుర్మార్గంగా వ్యవహరించడం కరెక్టు కాదని చంద్రబాబు అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్టును ఖండించిన చంద్రబాబు.. అక్రమ కేసులతో తమ నేతల ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.