ఎన్ఐఏకి కోరేగావ్-భీమా కేసు దర్యాప్తు.. కేంద్రంతో మహారాష్ట్ర సర్కార్ ఢీ !

2018 నాటి కోరేగావ్-భీమా కేసు దర్యాప్తును కేంద్రం ఎన్ఐఏకి అప్పగించింది. ఈ కేసుకు సంబంధించి తదనంతర చర్యలపై మహారాష్ట్ర ప్రభుత్వం పూణేకి చెందిన సీనియర్ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగానే కేంద్రం ఈ చర్య తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వానికి షాక్ నిచ్చింది. కోరేగావ్-భీమా హింస ఘటనతో ప్రమేయమున్నట్టు భావిస్తున్న మేధావులు, సామాజికవేత్తలపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ […]

ఎన్ఐఏకి కోరేగావ్-భీమా కేసు దర్యాప్తు.. కేంద్రంతో మహారాష్ట్ర సర్కార్ ఢీ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 25, 2020 | 5:50 PM

2018 నాటి కోరేగావ్-భీమా కేసు దర్యాప్తును కేంద్రం ఎన్ఐఏకి అప్పగించింది. ఈ కేసుకు సంబంధించి తదనంతర చర్యలపై మహారాష్ట్ర ప్రభుత్వం పూణేకి చెందిన సీనియర్ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగానే కేంద్రం ఈ చర్య తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వానికి షాక్ నిచ్చింది. కోరేగావ్-భీమా హింస ఘటనతో ప్రమేయమున్నట్టు భావిస్తున్న మేధావులు, సామాజికవేత్తలపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఆకస్మిక నిర్ణయాన్ని తీసుకోవడాన్ని పలువురు రాష్ట్ర మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుధ్ధమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ వ్యాఖ్యానించారు. మా ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడమేమిటన్నారు. అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర ఆహద్.. లా అండ్ ఆర్డర్ అన్నది రాష్ట్రానికి సంబంధించిన అంశమని.. తమ సిధ్ధాంతాలను వ్యతిరేకించే యాక్టివిస్టులను, మేధావులను ‘ అర్బన్ నక్సల్స్’ పేరిట జైలుకు పంపాలన్న కేంద్ర యోచన సరికాదని అన్నారు.

2018 జనవరి 1 న పూణే జిల్లా సమీపంలోని కోరేగావ్-భీమాప్రాంతంలో జరిగిన హింస తాలూకు కేసు ఇది.. బ్రిటిష్ వారి హయాంలో జరిగిన పోరాటంలో తాము విజయం సాధించి 200 సంవత్సరాలైన సందర్భంగా దళిత బృందాలు సంబరాలు జరుపుకొంటుండగా..అల్లర్లు చెలరేగాయి. అంతకుముందే జరిగిన కార్యక్రమంలో సామాజికవేత్తలు, మేధావులు చేసిన ప్రసంగాలు ఈ అల్లర్లను రెచ్ఛగొట్టాయని పోలీసులు వారిపై కేసులు పెట్టారు. దేశ వ్యాప్తంగా అనేకమంది ఇళ్లపై దాడులు చేసి అదుపులోకి తీసుకున్నారు. వారికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని మహారాష్ట్రలో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం గతంలో ఆరోపించింది.