UPSC Recruitment: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

UPSC Recruitment: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ జియో ఫిజిస్ట్‌, కెమిస్ట్‌, ఇతర పోస్టుల భర్తీకి యూపీఎస్సీ (UPSC) నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు..

UPSC Recruitment: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
Upsc Jobs

Updated on: Apr 24, 2022 | 3:12 PM

UPSC Recruitment: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ జియో ఫిజిస్ట్‌, కెమిస్ట్‌, ఇతర పోస్టుల భర్తీకి యూపీఎస్సీ (UPSC) నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 67 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఉన్న 57 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్‌ కెమిస్ట్ (22)‌, అసిస్టెంట్‌ జియోఫిజిస్ట్ (40)‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (1), సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ (1), సీనియర్‌ లెక్చరర్‌ (1), సబ్ డివిజనల్‌ ఇంజినీర్‌ (2 ) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో పీపీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు మే 12ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Also Read: వేసవిలో పర్యటిస్తున్నారా.. ఈ టిప్స్ పాటించండి..

Vastu Tips: ఇతరులు వాడిన వస్తువులను ఉపయోగిస్తున్నారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి

Koratala Siva : తారక్ సినిమా కోసం విభిన్నమైన బ్యాక్ డ్రాప్‌ను సిద్ధం చేసిన కొరటాల

Loading...
Unable to load recommendations.
Follow Us