భారత ప్రభుత్వ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 327 ఇంజనీరింగ్ సర్వీసుల భర్తీకి ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? రేపటితో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 4, 2022వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్, డిప్లొమా లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) ఇన్‌స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్‌షిప్ ఎగ్జామినేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ ఇన్‌స్టిట్యూషన్ (ఇండియా) గ్రాడ్యుయేట్ సభ్యత్వ పరీక్ష లేదా వైర్‌లెస్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్, రేడియో ఇంజినీరింగ్ విభాగాల్లో ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అలాగే దరఖాస్తుదారుల వయసు జనవరి 1, 2023వ తేదీ నాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 3వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు జనరల్ అభ్యర్ధులు రూ.200లు దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అక్టోబర్ 10 నుంచి 18 వరకు దరఖాస్తుల ఉపసంహరణ చేసుకోవచ్చు. రాత పరీక్ష (ప్రిలిమినరీ/మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ రాత పరీక్ష ఫిబ్రవరి 19, 2023న నిర్వహిస్తారు.ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.