UPSC CMS 2022: యూపీఎస్సీ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే..

|

Apr 07, 2022 | 7:23 AM

భారత ప్రభుత్వానికి చెందిన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC).. 2022 సంవత్సరానికిగానూ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (combined medical services)లో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

UPSC CMS 2022: యూపీఎస్సీ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే..
Upsc Cms 2022
Follow us on

UPSC Combined Medical Services Examination 2022: భారత ప్రభుత్వానికి చెందిన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC).. 2022 సంవత్సరానికిగానూ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (combined medical services)లో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పరీక్ష: కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2022

మొత్తం ఖాళీలు: 687

కేటగిరిల వారీగా పోస్టుల వివరాలు:

  • కేటగిరి 1లో సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌లో జీడీఎంఓ పోస్టులు: 314
  • కేటగిరి 2లో..
    అసిస్టెంట్‌ డివిజనల్‌ మెడికల్ ఆఫీసర్‌ (రైల్వేస్‌): 300
    జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ (న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌): 3
    జనరల్ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ (ఈడీఎంసీ, ఎన్‌డీఎంసీ, ఎస్డీఎంసీ):70

వయోపరిమితి: ఆగస్టు 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్‌ చేసి ఉండాలి. ఎంబీబీఎస్‌ చివరి ఏడాది పరీక్షలు రాసిన విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 26, 2022.(సాయంత్రం 6 గంటలు)

దరఖాస్తు రుసుము:
జనరల్ అభ్యర్ధులకు: రూ. 200
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం

కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2022 పరీక్ష తేదీ: జులై 17, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Telangana Jobs 2022: తెలంగాణ గ్రూప్‌-1, 2 అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. ఉచిత శిక్షణతోపాటు స్టైఫండ్‌ కూడా! వెంటనే దరఖాస్తు..