
యుకో బ్యాంక్ 2026-27 సంవత్సరానికి సంబంధించి జనరలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 173 జేఎంజీఎస్ 1 (జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ 1), డేటా ప్రైవసీ కంప్లయన్స్ ఆఫీసర్ 2 పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంబీఏ/ సీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఉద్యోగానుభవం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి అక్టోబర్ 1, 2026 నాటికి జేఎంజీఎస్ పోస్టులకు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎంఎంజీఎస్ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా ఈ పోస్టులకు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 2, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.800, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ లేదా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు జేఎంజీఎస్ పోస్టులకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు, ఎంఎంజీఎస్ పోస్టులకు రూ.64,820 నుంచి రూ.93,960 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్ లింక్‌లో చెక్ చేసుకోండి.
యూకో బ్యాంక్‌లో జనరలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.