UCIL Recruitment: యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో అప్రెంటిస్‌ పోస్ట్‌లు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

|

May 07, 2022 | 8:01 AM

UCIL Recruitment: యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (UCIL) పలు అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన యూసీఐఎల్‌లో వివిధ విభాగాల్లో ఉన్న అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను...

UCIL Recruitment: యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో అప్రెంటిస్‌ పోస్ట్‌లు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Ucil Jobs
Follow us on

UCIL Recruitment: యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (UCIL) పలు అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన యూసీఐఎల్‌లో వివిధ విభాగాల్లో ఉన్న అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 130 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో మైనింగ్‌ మేట్ (80)‌, బ్లాస్టర్ (20)‌, వైండింగ్‌ ఇంజన్‌ డ్రైవర్‌ (30) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదోతరగతి, ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

* అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 06-06-2022ని నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: ED Raids: 5 రాష్ట్రాల్లో ఈడీ దాడులు.. దారి మళ్లిన ఉపాధి హామీ పథకం నిధులు..

AP Police: విదేశీ యువతిపై అత్యాచారయత్నం కేసు.. 13 రోజుల్లోనే ట్రైల్ పూర్తి.. చరిత్ర సృష్టించిన ఏపీ పోలీస్ శాఖ

టీఆర్ఎస్‌తో పొత్తు ఉండబోదు.. పోరాటమే అంటోన్న రాహుల్ గాంధీ.. రైతులకు కాంగ్రెస్ హామీల వర్షం..