TSPSC Recruitment 2022: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోలీస్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. అదే విధంగా టీచర్ పోస్ట్‌లో భర్తీలో భాగంగా టెట్‌ను కూడా నిర్వహించారు. గ్రూప్1 నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రవాణా విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు మెకానికల్ ఇంజినీరింగ్/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా (ఆటోమొబైల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు వాలిడ్ హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 2-39 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* అభ్యర్థులను రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 45,960 నుంచి రూ. 1,24,150 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ 05-08-2022న ప్రారంభమై 05-09-2022తో ముగియనుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..