TGPSC Group 1 Prelims 2024: జగిత్యాలలో ఇన్విజిలేటర్‌ అత్యుత్సాహం.. పరీక్ష కేంద్రం ఎదుట గ్రూప్‌ -1 అభ్యర్థుల నిరసన

|

Jun 09, 2024 | 5:06 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం (జూన్‌ 9) టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే జగిత్యాల జిల్లాలోని ఓ పరీక్ష కేంద్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఓ ప్రైవేటు కాలేజీలో పరీక్ష జరుగుతున్న సమయంలో ఇన్విజిలేటర్‌ అత్యుత్సాహంతో అభ్యర్ధులకు తప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు. పరీక్ష ముగియడానికి ఇంకా అరగంట ఉందనంగా.. ఇంకా ఐదు నిమిషాలే ఉందని..

TGPSC Group 1 Prelims 2024: జగిత్యాలలో ఇన్విజిలేటర్‌ అత్యుత్సాహం.. పరీక్ష కేంద్రం ఎదుట గ్రూప్‌ -1 అభ్యర్థుల నిరసన
TGPSC Group 1 Exam
Follow us on

జగిత్యాల, జూన్‌ 9: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం (జూన్‌ 9) టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే జగిత్యాల జిల్లాలోని ఓ పరీక్ష కేంద్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఓ ప్రైవేటు కాలేజీలో పరీక్ష జరుగుతున్న సమయంలో ఇన్విజిలేటర్‌ అత్యుత్సాహంతో అభ్యర్ధులకు తప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు. పరీక్ష ముగియడానికి ఇంకా అరగంట ఉందనంగా.. ఇంకా ఐదు నిమిషాలే ఉందని అభ్యర్ధులను తొందర పెట్టాడు.

దీంతో సదరు ఇన్విజిలేటర్‌ అత్యుత్సాహం కారణంగా సమయం మించి పోతుందని అభ్యర్థులు తొందరలో ఓఎమ్‌ఆర్‌ షీట్‌లో ఏదో ఒక ఆన్సర్‌ను బబుల్ చేశారు. తీరా చేస్తే ఇంకా సమయం ఉందని తెలియడంతో ఆ గదిలోని గ్రూప్‌1 అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఇన్విజిలేటర్ తొందర పెట్టినందున కొన్ని ప్రశ్నలకు ఏదో ఒక ఆన్సర్‌ పెట్టి పరీక్ష త్వరగా ముగించామని, దీంతో తమకు మార్కులు తగ్గే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రూప్‌ 1 పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఓఎమ్ఆర్‌ షీట్‌పై పెన్సిల్‌తో కాకుండా.. బ్యాక్‌ లేదా బ్లూ కలర్‌ పెన్ను మాత్రమే వినియోగించాలని హాల్‌ టికెట్లపై కమిషన్ స్పష్టం పేర్కొంది. దీంతో అభ్యర్ధులంతా పెన్‌తోనే ఆన్సర్లను బబుల్‌ చేశారు. తప్పుగా గుర్తించిన సమాధానాలను ఎరైజర్‌తో చెరిపి సరైన సమాధానం పెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇన్విజిలేటర్‌ చేసిన తప్పిదానికి తామంతా సరైన సమాధానాలు గుర్తించకుండానే ఓఎమ్‌ఆర్‌ షీట్ నింపేశామని, తమకు మార్కులు తక్కువవచ్చే అవకాశం ఉందని ఆ గదిలోని అభ్యర్ధులంతా ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కాలేజీ ఎదుట వారంతా నిరసన చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.