Group 4: గ్రూప్‌4 రాస్తున్న మహిళా అభ్యర్థులకు ఊరట.. ఆ నిబంధన లేదని TSPSC క్లారిటీ

|

Jun 30, 2023 | 7:04 PM

తెలంగాణలో శనివారం (రేపు) గ్రూప్‌ 4 పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రికార్డు స్థాయిలో 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పరీక్ష ప్రశాంతంగా సాగేలా నిబంధనలు రూపొందించారు...

Group 4: గ్రూప్‌4 రాస్తున్న మహిళా అభ్యర్థులకు ఊరట.. ఆ నిబంధన లేదని TSPSC క్లారిటీ
Group 4 Exam
Follow us on

తెలంగాణలో శనివారం (రేపు) గ్రూప్‌ 4 పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రికార్డు స్థాయిలో 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పరీక్ష ప్రశాంతంగా సాగేలా నిబంధనలు రూపొందించారు. ఈక్రమంలోనే పరీక్ష కేంద్రాల వద్ద మహిళల తాళి బొట్లను, మెట్టెలను తీసేస్తారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోన్న క్రమంలో టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటన చేసింది. ఈ విషయమై TSPSC ఛైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

పరీక్షకు హాజరయ్యే మహిళలు తాళిబొట్లు, మెట్టేలు తీసేయాలనే నిబంధన అనేది అసలు లేదని తేల్చి చెప్పారు. కొందరు కావాలనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని, వీటిని నమ్మకూడదని జనార్థన్‌ తెలిపారు. ఇక మహిళలు, పురుషల కోసం ప్రత్యేకంగా చెక్‌ పాయింట్స్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన ఛైర్మన్‌.. ఇందుకోసం సరిపడా మహిళా సిబ్బందిని నియమించకుంటామని తెలిపారు.

పుస్తె, మట్టెలు తీస్తే ఊరికునేది లేదు..

ఇదిలా ఉంటే పరీక్షల సమయంలో తనిఖీల పేరుతో హిందూ మహిళల మనోభావాలు దెబ్బతిస్తే ఊరుకునేది లేదని వీహెచ్‌పీ హెచ్చరించింది. తాళిబొట్టు.. గాజులు.. ముక్కుపుడకలు.. చెవి రింగులు తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బజరంగ్ దళ్ హెచ్చరికలు జారీ చేసింది. తనిఖీల పేరుతో నగలు తొలగించి హిందువులను అవమానాలపాలు చేస్తే .. అధికారులపై మహిళలు తిరుగుబాటు చేయాలని బజరంగ్‌దళ్‌ పిలుపునిచ్చింది. అయితే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి తెర పడినట్లైంది.

ఇవి కూడా చదవండి

అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన TSPSC..

ఇదిలా ఉంటే తెలంగాణ గ్రూప్ -4 ఎగ్జామ్ కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2878 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు మొత్తం 9.51 లక్షల మంది హాజరుకానున్నారు. మొత్తం 8180 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. పేపర్‌-1 (జనరల్‌ స్టడీస్‌) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్‌-2 (సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షా స్టార్ట్‌ అయ్యే 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..