ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికేట్‌ అప్పుడైనా సమర్పించవచ్చు.. కంగారొద్దు! TSLPRB

|

May 09, 2022 | 9:33 AM

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఐతే పోలీసు ఉద్యోగాల కోసం చేస్తున్న దరఖాస్తుల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల(EWS) అభ్యర్థులు ప్రస్తుతం ఓసీగానే పేర్కొనాలని..

ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికేట్‌ అప్పుడైనా సమర్పించవచ్చు.. కంగారొద్దు! TSLPRB
Ews Certificate
Follow us on

Telangana Economically Weaker Section(EWS) Certificate Eligibility criteria: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఐతే పోలీసు ఉద్యోగాల కోసం చేస్తున్న దరఖాస్తుల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల(EWS) అభ్యర్థులు ప్రస్తుతం ఓసీగానే పేర్కొనాలని తెలంగాణ స్టేట్‌ లెవల్ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు సూచించారు. ప్రిలిమ్స్‌ రాతపరీక్ష తర్వాత ఎంపికైన అభ్యర్థుల నుంచి రెండో విడత సమగ్ర దరఖాస్తు తీసుకుంటామని, ఆ సమయంలో ఈడబ్ల్యూఎస్‌ వివరాలు, ధ్రువీకరణపత్రం సమర్పించాల్సి ఉంటుందన్నారు.

తాజా పోలీస్‌ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా కలిగిన వారికి వయోపరిమితిలో సడలింపు ఉండటంతో ఈ ధ్రువీకరణ పత్రానికి ప్రాధాన్యం సంతరించుకొంది. అయితే, తహశీల్దారు కార్యాలయాల నుంచి ఈ ధ్రువీకరణపత్రం పొందే క్రమంలో కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తుతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తాజాగా ఈ సూచన చేస్తూ.. అభ్యర్థులు ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణపత్రాలకు ఆందోళన చెందొద్దని స్పష్టం చేసింది.

Also Read:

AP KGBV Admissions 2022: కేజీబీవీల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే..