Telugu News Education Career Jobs TSBIE released Inter 1st and 2nd year Supplementary Exam 2024 Revised schedule, here's full time table
TS Inter Supply Time Table 2024: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పులు.. పూర్తి టైం టేబుల్ ఇదే
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ను తాజాగా ఇంటర్‌బోర్డు సవరించి కొత్త టైం టేబుల్‌ను విడుదల చేసింది. తొలుత మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మే 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు..
హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ను తాజాగా ఇంటర్‌బోర్డు సవరించి కొత్త టైం టేబుల్‌ను విడుదల చేసింది. తొలుత మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మే 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు శనివారం (ఏప్రిల్ 27) విడుదల చేసింది.
ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5:30వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జూన్ 4నుంచి 8వరకు నిర్వహిస్తారు. ఫస్టియర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ జూన్ 10న ఉదయం 9గంటలకు నిర్వహిస్తారు. జూన్ 11న ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్, 12న ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.