TS TET 2024 Result Date: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ టెట్‌ పరీక్షలు.. రిజల్ట్స్ ఎప్పుడంటే!

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) పరీక్షలు జూన్‌ 2 (ఆదివారం)తో ముగిశాయి. మే 20వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు సుమారు 12 రోజుల పాటు కొనసాగాయి. రోజుకు రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు జరిగాయి. పేపర్ 1 పరీక్షకు 86.03 శాతం మంది హాజరుకాగా పేపర్ 2 పరీక్షకు 82.58 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. కాగా తెలంగాణ టెట్‌ పరీక్షకు మార్చి 15న నోటిఫికేషన్‌ విడుదలైన..

TS TET 2024 Result Date: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ టెట్‌ పరీక్షలు.. రిజల్ట్స్ ఎప్పుడంటే!
TS TET 2024 Result Date

Updated on: Jun 03, 2024 | 2:32 PM

హైదరాబాద్‌, జూన్‌ 3: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) పరీక్షలు జూన్‌ 2 (ఆదివారం)తో ముగిశాయి. మే 20వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు సుమారు 12 రోజుల పాటు కొనసాగాయి. రోజుకు రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు జరిగాయి. పేపర్ 1 పరీక్షకు 86.03 శాతం మంది హాజరుకాగా పేపర్ 2 పరీక్షకు 82.58 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

కాగా తెలంగాణ టెట్‌ పరీక్షకు మార్చి 15న నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. పేపర్ 1 పరీక్షకు మొత్తం 99,958 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక పేపర్ 2 పరీక్షకు 1,86,423 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది టెట్‌ పరీక్షకు మొత్తం 2.86 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్‌ కీ త్వరలోనే విడుదల కానుంది. ఫలితాలు జూన్‌ 12న విడుదలయ్యే అవకాశం ఉంది.

తాజాగా నిర్వహించిన టెట్‌ పరీక్షలను తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో విద్యాశాఖ నిర్వహించింది. టెట్‌ పరీక్షలను మొత్తం 11 జిల్లా కేంద్రాల్లో నిర్వహించారు. డీఎస్సీ నియామకాల్లో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అలాగే ప్రభుత్వ టీచర్‌ పోస్టుల నియామకాలకు నిర్వహించే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) రాసేందుకు టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.