బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులకు సదవకాశం, తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు పొందే లక్కీ ఛాన్స్. తెలంగాణ హైకోర్టు సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న సిస్టమ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్(నం.08/2023) జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 45 సిస్టమ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55% మార్కులతో బీఈ, బీటెక్ (సీఎస్‌ఈ/ ఐటీ/ ఈసీఈ)/ డిప్లొమా(ఎలక్ట్రానిక్స్), బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్స్/ ఐటీ)లో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో కంప్యూటర్ హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌పై పరిజ్ఞానం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 11-01-2023 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్/ బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సీబీటీ పరీక్ష (90 మార్కులు), ఇంటర్వ్యూ (10 మార్కులు), రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,280 నుంచి రూ.72,850 చెల్లిస్తారు.
* పరీక్ష విధానం విషయానికొస్తే.. కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)లో 90 (కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్) ప్రశ్నలుంటాయి. ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.
* ఓసీ/బీసీ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ. 600, ఎస్సీ.. ఎస్టీ అభ్యర్థులు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 21-01-2023న మొదలవుతుండగా, 11-02-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
* కంప్యూటర్ బేస్‌డ్ హాల్ టికెట్ డౌన్‌లోడ్‌ను 20-02-2023 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షను మార్చి 2023లో నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..