TS EDCET 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ముఖ్యమైన తేదీలివే!

|

Apr 09, 2022 | 8:38 AM

తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EDCET) 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుక్రవారం (ఏప్రిల్‌ 7) ప్రారంభమైంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం..

TS EDCET 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ముఖ్యమైన తేదీలివే!
Upsc Ese 2021 Results
Follow us on

TS EDCET 2022 Application last date: తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EDCET) 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుక్రవారం (ఏప్రిల్‌ 7) ప్రారంభమైంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా జూన్ 15 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. రూ.250 ఆలస్య రుసుముతో జూలై 1 వరకు, అలాగే రూ.500 ఆలస్య రుసుముతో జులై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ విద్యాశాఖ తెల్పింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో TS EDCET– edcet.tsche.ac.in దరఖాస్తు చేసుకోవచ్చు. ఎడ్‌సెట్‌ పరీక్ష జూలై 26, 27 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించబడుతుంది.

కాగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో రెండు సంవత్సరాల BEd రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు గానూ తెలంగాణ ఉన్నత విద్యామండలి (TSCHE) తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎడ్‌సెట్‌ నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షకు కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా అర్హులే.

TS EDCET 2022కు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను edcet.tsche.ac.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • అప్లికేషన్ ట్యాబ్ కింద, ఫీజు చెల్లింపు లింక్‌పై క్లిక్ చెసి, ఫీజు చెల్లించాలి.
  • తర్వాత అవసరమైన సమాచారంతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
  • సూచించిన ఐడీతో లాగిన్ అయ్యి, అవసరమైన సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేసి, సబ్‌మిట్‌ చెయ్యాలి.
  • పూరించిన దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని, ప్రింట్‌ఔట్‌ తీసుకోవాలి.

Also Read:

IDRBT Hyderabad Jobs 2022: నెలకు లక్ష జీతంతో హైదరాబాద్‌ ఐడీఆర్‌బీటీలో కొలువుల జాతర.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..