TMC Recruitment: టాటా మెమోరియల్ సెంటర్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంస్థకు చెందిన వారణాసిలోని హామీ భాభా క్యాన్సర్ హాస్పిటల్‌లో నాన్ మెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో క్వాలిటీ మేనేజర్ (01), సైంటిఫిక్ ఆఫీసర్ (01), మెడికల్ ఫిజిసిస్ట్ (01), అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ (02), ఫిమేల్ నర్స్ (01), సైంటిఫిక్ అసిస్టెంట్ (06), టెక్నీషియన్ (10) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, డిప్లొమా బీఎస్సీ, జీఎన్‌ఎం, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 27 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ/ స్కిల్‌టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 19,900 నుంచి రూ. 67,700 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 28-05-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: Jayamma Panchayathi: మహేష్ బాబు చేతుల మీదుగా జయమ్మ పంచాయతీ ట్రైలర్.. ఈసారి మరింత ఆసక్తికరంగా..
Bay Leaves Benefits: బిర్యానీ ఆకు ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..