TISS Mumbai Assistant Professor Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS).. ఒప్పంద ప్రాతిపదికన 6 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో పోలిటికల్ సైన్స్/ఇంటర్నేషనల్ రిలేషన్/పొలిటికల్ డెమోగ్రఫీ అండ్ పాపులేషన్ స్టడీస్/లా-గవర్నెన్స్ మేనేజ్‌మెంట్ లేదా తత్సమానా స్పెషలైజేషన్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ డిగ్రీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్/స్లెట్/సెట్‌లో అర్హత సాధించినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 7, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్ధులకు రూ.1000లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు రూ.250లు చెల్లించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ ఎంపిక ఉంటుంది. అర్హత సాధించినవారికి నెలకు రూ.57,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.