
అమరావతి, ఆగస్ట్ 25: రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ డిగ్రీ ప్రవేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది డిగ్రీ కౌన్సెలింగ్‌లో కాలేజీల లాగిన్ నుంచి కూడా వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాట్లు ఉన్నత విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే కళాశాలల నుంచి కూడా ఆకోర్సుల ఎంపికకు వెబ్‌ఐచ్ఛికాలు నమోదు చేసుకోవడానికి అవకాశం లభించినట్లైంది. అయితే కాలేజీల లాగిన్ నుంచి నేరుగా వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేస్తే మాత్రం మార్పులకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది.
జేఎన్‌టీయూహెచ్ అనుబంధ కాలేజీల్లో మిగిలిపోయిన ఇంజినీరింగ్ సీట్లకు గస్టు 26 నుంచి స్పాట్ ప్రవేశాలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. వర్సిటీ క్యాంపస్‌తో సహా మొత్తం 8 కళాశాలల్లో 978 సీట్లు మిగిలిపోయినట్లు డైరెక్టర్ బి బాలునాయక్ తెలిపారు. జేఎన్‌టీయూ క్యాంపస్‌లో 23 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో అత్యధికంగా 13 సీట్లు మిగిలిపోయాయి. ఆయా కాలేజీల్లో సీట్ల భర్తీకి ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.