టీజీపీఎస్సీ గ్రూప్‌-1 పిటిషన్లపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌ చేసిన తెలంగాణ హైకోర్టు

TGPSC గ్రూప్‌-1 పిటీషన్లపై తెలంగాణ హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. 2024 అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

టీజీపీఎస్సీ గ్రూప్‌-1 పిటిషన్లపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌ చేసిన తెలంగాణ హైకోర్టు
TGPSC Group 1 Case

Updated on: Jul 07, 2025 | 9:40 PM

TGPSC గ్రూప్‌-1 పిటీషన్లపై తెలంగాణ హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. 2024 అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మెయిన్స్‌ పత్రాలు పునః మూల్యాంకనం చేయాలని, మూల్యాంకనం చేయకపోతే మళ్లీ పరీక్షలు పెట్టాలని పిటిషనర్లు కోరారు. పిటిషనర్ల తరపున న్యాయవాది విద్యా సాగర్ రావు ప్రధానంగా మూడు అంశాలను లేవనెత్తారు.

అయితే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. పరీక్ష నిర్వహణ సరిగ్గా, పారదర్శకంగా జరిగిందని, వాల్యుయేషన్ నిపుణులు అర్హులైన వారేనని వాదించారు. వాదనలను త్వరగా పూర్తి చేయాలని, ఇప్పటికే చేసిన వాదనలను రిపీట్ చేయవద్దని, కొత్త అంశాలను మాత్రమే సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

వాదనలు పూర్తి కాకపోతే రాతపూర్వకంగా సమర్పించాలని కోర్టు సూచించింది. ఏప్రిల్‌లో గ్రూప్‌ 1 నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. అయితే సర్టిఫికేట్ ధృవీకరణ ప్రక్రియ కొనసాగనివ్వాలని ఆదేశించింది. TGPSC ఈ ఆదేశాన్ని సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది. ఆ స్టేను తొలగించాలని గ్రూప్‌ 1కు ఎంపికైన అభ్యర్థులు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేయడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..