AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS ICET Results 2025: తెలంగాణ ఐసెట్ ఫలితాల్లో ఆంధ్రా అబ్బాయి సత్తా.. రిజల్ట్స్‌ను డైరెక్ట్‌గా ఇక్కడ చెక్ చేసుకోండి..

TG ICET Results 2025: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం రాసిన ఐసెట్ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి సోమవారం విడుదల చేసింది. జూన్ 8, 9 తేదీల్లో జరిగిన ఐసెట్ ప్రవేశ పరీక్షకు 64,938 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 71,746 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. పరీక్ష రాసిన వారిలో 58,985 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఐసెట్ ఉత్తీర్ణత శాతం 90.83 నమోదైనట్లు హైయర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది.

TS ICET Results 2025: తెలంగాణ ఐసెట్ ఫలితాల్లో ఆంధ్రా అబ్బాయి సత్తా.. రిజల్ట్స్‌ను డైరెక్ట్‌గా ఇక్కడ చెక్ చేసుకోండి..
Telangana Icet 2025 Results
Vidyasagar Gunti
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jul 07, 2025 | 5:25 PM

Share

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం రాసిన ఐసెట్ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి సోమవారం విడుదల చేసింది. జూన్ 8, 9 తేదీల్లో జరిగిన ఐసెట్ ప్రవేశ పరీక్షకు 64,938 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 71,746 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. పరీక్ష రాసిన వారిలో 58,985 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఐసెట్ ఉత్తీర్ణత శాతం 90.83 నమోదైనట్లు హైయర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఐసెట్ లో అమ్మాయిలు 30,986, అబ్బాయిలు 27998 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా.. పరీక్షలో కనీసం 25 శాతం మార్కులు సాధిస్తే వారిని ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఐసెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌ ను, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ నంబర్ ను ఎంటర్‌ చేసి తాము సాధించిన మార్కులు, ర్యాంక్‌లను అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

ర్యాంక్ కార్డులను డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఈ లింకును క్లిక్ చేయండి..

ఐసెట్ ఫలితాల్లో అబ్బాయిలదే హవా..

తెలంగాణ ఐసెట్ ఫలితాల్లో టాప్ 4 అబ్బాయిలే నిలిచారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన క్రాంతి కుమార్ తెలంగాణ ఐసెట్ టాపర్‌గా నిలిచారు. 179.93 మార్కులతో అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు.. కామారెడ్డికి చెందిన సాయికృష్ణకు 155.17 మార్కులతో సెకెండ్ ప్లేస్ దక్కింది. మహబూబాబాద్ కు చెందిన కౌశిక్ 3వ ర్యాంక్, హైదరాబాద్ కు చెందిన కృష్ణ వర్ధన్ కు నాలుగవ ర్యాంక్, జగిత్యాలకు చెందిన వైష్ణవికి టాప్ 5 ర్యాంక్ కైవసం చేసుకుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..