TGCET 2022: తెలంగాణ గురుకులాల్లో ఐదోతరగతిలో ప్రవేశానికి మే 8న ఎంట్రన్స్ టెస్ట్‌..

|

May 06, 2022 | 3:06 PM

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదోతరగతిలో ప్రవేశానికి (5th class entrance exam date) మే 8న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు..

TGCET 2022: తెలంగాణ గురుకులాల్లో ఐదోతరగతిలో ప్రవేశానికి మే 8న ఎంట్రన్స్ టెస్ట్‌..
Tgcet 2022
Follow us on

Telangana Gurukul Common Entrance Test date 2022: తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదోతరగతిలో ప్రవేశానికి (5th class entrance exam date) మే 8న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు గురుకుల సెట్‌ కన్వీనర్‌ రొనాల్డ్‌రాస్‌ తెలిపారు. ప్రవేశ పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని, రాష్ట్రవ్యాప్తంగా 415 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకుల సొసైటీల్లో మొత్తం 48,120 సీట్లు ఉన్నట్లు, వీటి కోసం దాదాపు 1.48 లక్షల మంది విద్యార్ధులు పోటీపడుతున్నారని వివరించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, కరోనా నిబంధనలు పాటించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గురుకుల అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

ఏయే గురుకులాల్లో ఎన్ని సీట్లు ఉన్నాయంటే..

సొసైటీ         బాలికలు        బాలురు          మొత్తం         సీట్లు

ఎస్సీ            90                   140                   230             18400

ఎస్టీ               35                   42                     77                6080

బీసీ              132                 129                   261              20800

సాధారణ      15                   20                    35                2840

మొత్తం        272                 331                  603              48120

Also Read:

దేశంలో 10 కోట్ల ఉద్యోగాలున్నా.. నైపుణ్య యువత కొరత: AICTE