TFRI Recruitment 2022: నెలకు రూ.54,000లజీతంతో.. ట్రాపికల్ ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చ్ స్టాఫ్‌ ఉద్యోగాలు..

|

Jun 09, 2022 | 6:48 PM

కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన జబల్‌పూర్‌లోని ట్రాపికల్ ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (TFRI).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టు (Project Associate posts)ల భర్తీకి అర్హులైన..

TFRI Recruitment 2022: నెలకు రూ.54,000లజీతంతో.. ట్రాపికల్ ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చ్ స్టాఫ్‌ ఉద్యోగాలు..
Tfri
Follow us on

TFRI Research Staff Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన జబల్‌పూర్‌లోని ట్రాపికల్ ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (TFRI).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టు (Project Associate posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 7

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్, జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో పోస్టులు

కాల వ్యవధి: 5 సంవత్సరాలు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ. 19,000ల నుంచి 54,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు రుసుము: రూ.100

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.