AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపే ఇన్‌ సర్వీస్‌ టీచర్ల TET ఫలితాలు 2026.. ఎన్ని గంటలకంటే?

తెలంగాణలో ఇన్‌ సర్వీస్‌ టీచర్ల కోసం నిర్వహించిన ప్రత్యేక టెట్‌ ఫలితాలు సెప్టెంబర్‌ 26న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ పరీక్షకు మొత్తం 22,477 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు..

రేపే ఇన్‌ సర్వీస్‌ టీచర్ల TET ఫలితాలు 2026.. ఎన్ని గంటలకంటే?
Telangana In-Service Teachers TET Results
Srilakshmi C
|

Updated on: Sep 25, 2026 | 2:52 PM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్ 25: తెలంగాణ రాష్ట్రంలోని ఇన్‌ సర్వీస్‌ టీచర్ల కోసం నిర్వహించిన ప్రత్యేక టెట్‌ (TET) ఫలితాలు సెప్టెంబర్‌ 26న విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో టెట్‌ ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని టెట్‌ కన్వీనర్‌ గాజర్ల రమేశ్‌ వెల్లడించారు. ఇన్‌ సర్వీస్‌ టీచర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ టెట్‌కు మొత్తం 22,477 మంది ఉపాధ్యాయులు పరీక్ష రాశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలు విడుదలైన అనంతరం అభ్యర్థులు తమ టెట్‌ స్కోర్‌, అర్హత వివరాలను అధికారిక టెట్‌ వెబ్‌సైట్‌లో పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం సాధారణంగా హాల్‌టికెట్‌ నంబర్‌/అప్లికేషన్‌ వివరాలు అవసరం కావచ్చు.

తెలంగాణ ఇన్‌ సర్వీస్‌ టీచర్ల TET ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ టెట్‌ 2026 ఫలితాలు చెక్‌ చేసే విధానం ఇలా..

  • ముందుగా తెలంగాణ టెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • TET Results లింక్‌పై క్లిక్‌ చేయాలి.
  • హాల్‌టికెట్‌ నంబర్‌తోపాటు అడిగిన వివరాలను నమోదు చేయాలి.
  • సబ్మిట్‌ చేయగానే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • భవిష్యత్‌ అవసరాల కోసం ఫలితాల కాపీని డౌన్‌లోడ్‌ చేసుకుని భద్రపరుచుకోవాలి.

ఇన్‌ సర్వీస్‌ టీచర్ల కోసం నిర్వహించిన ప్రత్యేక టెట్‌ ఫలితాలు విడుదల కానుండటంతో పరీక్ష రాసిన 22,477 మంది ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. ఫలితాల విడుదల అనంతరం అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు, స్కోర్‌ కార్డులు తదితర అంశాలపై అధికారికంగా మరింత సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఇన్‌ సర్వీస్‌ టీచర్ల TET ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బంపరాఫర్.. రూ.11కే సల్మాన్ కొత్త సినిమా టికెట్.. పూర్తి వివరాలివే
బంపరాఫర్.. రూ.11కే సల్మాన్ కొత్త సినిమా టికెట్.. పూర్తి వివరాలివే
కాళీమాతను అమావాస్య రోజే ఎందుకు పూజిస్తారు? అర్ధరాత్రి ఆరాధన..
కాళీమాతను అమావాస్య రోజే ఎందుకు పూజిస్తారు? అర్ధరాత్రి ఆరాధన..
క్యాన్సర్ కణితి కాదు.. పంటి ముక్క! అరుదైన కేసులో షాకింగ్ ట్విస్ట్
క్యాన్సర్ కణితి కాదు.. పంటి ముక్క! అరుదైన కేసులో షాకింగ్ ట్విస్ట్
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. కొత్త పోర్టల్..
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. కొత్త పోర్టల్..
అప్పుడే OTTలో శ్రీదేవి కొత్త సినిమా.. జెన్‌జీకి తెగ నచ్చేసిన మూవీ
అప్పుడే OTTలో శ్రీదేవి కొత్త సినిమా.. జెన్‌జీకి తెగ నచ్చేసిన మూవీ
బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు..!
బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు..!
రూరలైనా.. అర్బనైనా.. వార్ మాత్రం వన్‌సైడేనా..
రూరలైనా.. అర్బనైనా.. వార్ మాత్రం వన్‌సైడేనా..
మీ పిల్లలు తెలివైన వారో కాదో ఎలా తెలుసుకోవాలో తెలుసా?
మీ పిల్లలు తెలివైన వారో కాదో ఎలా తెలుసుకోవాలో తెలుసా?
దీపావళి రోజున కేదారేశ్వర వ్రతం ఇలా చేస్తే శుభప్రదం.. సౌభాగ్యం..
దీపావళి రోజున కేదారేశ్వర వ్రతం ఇలా చేస్తే శుభప్రదం.. సౌభాగ్యం..
వాస్తు టిప్స్ : దీపావళికి అస్సలే ఇవ్వకూడని బహుమతులు ఇవే!
వాస్తు టిప్స్ : దీపావళికి అస్సలే ఇవ్వకూడని బహుమతులు ఇవే!