TS Police Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. పోలీసు నియామకాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

Telangana Police Recruitment: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ రానే వచ్చింది. 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా..

TS Police Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. పోలీసు నియామకాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
Telangana Jobs

Updated on: Apr 25, 2022 | 5:23 PM

Telangana Police Recruitment: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ రానే వచ్చింది. 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా.. తొలుత పోలీసు ఉద్యోగ నియామకాలు చెపట్టింది తెలంగాణ సర్కార్. తెలంగాణలో పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ప్రకారం..
మొత్తం 16,027 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిలో టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్ కానిస్టేబుళ్లు 5,010, సివిల్ కానిస్టేబుళ్లు 4,965, ఏఆర్ కానిస్టేబుళ్లు 4,423 పోస్టులు, ఇక తెలంగాణలో 414 ఎస్సై పోస్టులకు కూడా నోటిఫికేషన్ జారీ చేశారు. స్పెషల్ పోలీస్ ఫోర్స్ 390, ఫైర్ 610, డ్రైవర్స్ 100, మే 2వ తేదీ నుంచి నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అనుమతి ఇచ్చారు. అభ్యర్థులు www.tslprb.in లో దరఖాస్తు చేసుకోవచ్చు అని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. పూర్తి వివరాల కోసం పోలీసు నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.tslprb.in ని సంప్రదించవచ్చు..

Also read:

Lemon Side Effects: నిమ్మరసం అతిగా తాగుతున్నారా? అయితే ఈ అనర్థాలు మీరు తెలుసుకోవాల్సిందే

Health Photos: వ్యాధులు దూరంగా ఉండాలంటే ఈ మూలికలు డైట్‌లో ఉండాల్సిందే..!

Viral Video: దోశ విక్రేత అసాధారణ నైపుణ్యం.. ఫ్లయింగ్ దోశ ప్రముఖ్య వ్యాపార వేత్తను ఆకట్టుకున్న ప్రత్యేక శైలి.. వీడియో వైరల్