TS Inter Subjects: ఇంటర్‌లో పొలిటికల్ సైన్స్‌ సబ్జెక్టును తొలగిస్తున్నారంటూ నెట్టింట ప్రచారం! తెలంగాణ ఇంటర్‌ బోర్డు క్లారిటీ..

|

May 31, 2022 | 6:38 PM

తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా ఇంటర్‌ విద్యలో కొన్ని సబ్జెక్టులను తొలగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఇంర్మీడియ్‌ బోర్డ్‌ క్లారిటీ ఇచ్చింది..

TS Inter Subjects: ఇంటర్‌లో పొలిటికల్ సైన్స్‌ సబ్జెక్టును తొలగిస్తున్నారంటూ నెట్టింట ప్రచారం! తెలంగాణ ఇంటర్‌ బోర్డు క్లారిటీ..
TS Inter Supply Exams
Follow us on

Political Science Subject in Telangana Inter Group Courses: తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా ఇంటర్‌ విద్యలో కొన్ని సబ్జెక్టులను తొలగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఇంర్మీడియ్‌ బోర్డ్‌ క్లారిటీ ఇచ్చింది. ఇంటర్‌ స్థాయిలో అందిస్తున్న సబ్జెక్టుల జాబితా నుంచి రాజనీతిశాస్త్రాన్ని (Political Science) తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఇంటర్‌బోర్డు సెక్రటరీ జలీల్‌ మంగళవారం (మే 31) ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అటువంటి ప్రతిపాదనలు, ఆలోచన ఇంటర్‌ బోర్డుకు లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్‌లో పొలిటికల్ సైన్స్‌ను తొలగిస్తున్నారనే వదంతులను ఖండించారు. ఆర్ట్స్‌ గ్రూపులైన CEC, HEC గ్రూపుల్లో సివిక్స్‌ సబ్జెక్టును అందిస్తున్నారు. సమాజ అవసరాలను బట్టి కొత్త కోర్సులను తీసుకొస్తున్నామని ఇంటర్ బోర్డు ప్రకటించిందే కానీ.. ఈ ప్రక్రియలో భాగంగా ఏ సబ్జెక్ట్‌ను తొలగించడం లేదని తెల్పిపారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఈ విషయంపై వస్తు్న్న వదంతులను నమ్మొద్దని జలీల్‌ సూచించారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.