
హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.97 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్ ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే (మార్చి 30) సమాధాన పత్రాల మూల్యాంకనం మార్చి 30తో ముగిసింది. దీంతో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెంకడ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల 2026 ఫలితాలు ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. మూల్యాంకనం తర్వాత మార్కుల క్రోడీకరణ పనులు కూడా దాదాపు ముగింపుకు చేరుకున్నాయి. దీంతో ఫలితాలు ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఇంటర్ బోర్డు ఫలతాల తేదీని ఖరారు చేయనుంది. ఆ వెనువెంటనే ఫలితాలు ప్రకటిస్తుంది. కాగా గత ఏడాది ఏప్రిల్ 22న ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి కాస్త ముందుగానే ఫలితాలు వెల్లడించాలని భావించిన ఇంటర్ బోర్డు అధికారులు మూల్యాంకనం ప్రక్రియను వేగంగా పూర్తి చేసింది.
తెలంగాణ ఇంటర్ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అంతా సవ్యంగా జరిగితే అంతకంటే ముందే అంటే ఏప్రిల్ 11వ తేదీన లేదంటే ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిజానికి తొలుత ఏప్రిల్ 6న ఫలితాలు విడుదల చేయాలనుకున్నప్పటికీ బడ్జెట్ సమావేశాల కారణంగా ఇంటర్ ఫలితాలను అధికారులు వాయిదా వేశారు. కాగా ఈ ఏడాది తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,97,075 మంది హాజరయ్యారు. వీరిలో 4,89,126 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు, 5,07,949 మంది సెకండ్ ఇయర్ విద్యార్ధులు ఉన్నారు.
తెలంగాణ ఇంటర్ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈసారి మొత్తం మూడు విడతల్లో మూల్యాంకనం ప్రక్రియ పూర్తి చేశారు. మార్చి 15 నుంచి మొదటి విడత, మార్చి 18 నుంచి రెండో విడత, మార్చి 20 నుంచి మూడో విడత మూల్యాంకనం పూర్తి చేశారు. మార్చి 4 నుంచి సంస్కృతం పేపర్లతో ప్రారంభమైన మార్చి 30వ తేదీతో ముగిసింది. మూల్యాంకనంలో ఒక్క సబ్జెక్టులో తప్పిన వారు మొత్తం 1.05 లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అన్ని సబ్జెక్టులు పాసైనవారు ఒక్క సబ్జెక్టులో ఎందుకు తప్పారు? మూల్యాంకనంలో ఏమైనా పొరపాటు జరిగిందా? అనే కోణంలో జవాబుపత్రాలను మరోమారు బయటకు తీసి పరిశీలించినట్లు సమాచారం. ఈసారి జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం, అల్పాహారం అమలు చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్‌ను సైతం మార్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదగా ఫలితాలు విడుదల చేయించాలని ఇంటర్ బోర్డు యోచిస్తుంది. ఈ క్రమంలో ఏ క్షణమైనా ఫలితాల తేదీని ఇంటర్ బోర్డు ప్రకటించే అవకాశం ఉంది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేస్తారు. ఫలితాలు విడుదలైన తర్వాత ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లోనూ ఫలితాలను నేరుగా చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.