10th Class Time Table 2026: తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదల.. ఏ పరీక్ష ఏ తేదీలోనంటే!

Telangana 10th Class Public Exams 2025 Time Table: రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ మంగళవారం (డిసెంబర్ 9) విడుదలైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి టైం టేబుల్‌ను ఈ కింద చెక్‌ చేసుకోండి...

10th Class Time Table 2026: తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదల.. ఏ పరీక్ష ఏ తేదీలోనంటే!
Telangana 10th Class Public Exam Time Table

Edited By: Srilakshmi C

Updated on: Dec 09, 2025 | 6:48 PM

హైదరాబాద్, డిసెంబర్‌ 9: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ మంగళవారం (డిసెంబర్ 9) విడుదలైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలుత ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈసారి పదవ తరగతి పరీక్షల్లో సమయంలో హాలిడేస్ రావడంతో ఒక్కో పరీక్షకు ఎక్కువ గ్యాప్ వచ్చింది. ప్రతి పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించినున్నారు. సైన్స్ పేపర్ రెండు భాగాలుగా రెండు రోజులు జరగనున్న నేపథ్యంలో ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు సైన్స్ పేపర్ 1, పేప 2 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి టైం టేబుల్‌ను ఈ కింద చెక్‌ చేసుకోండి.

పూర్తి టైం టేబుల్ ఇదే..

  • 14 మార్చి 2026 – ఫస్ట్ లాంగ్వేజ్
  • 18 మార్చి 2026 – సెకెండ్ లాంగ్వేజ్
  • 23 మార్చి 2026 – థర్డ్ లాంగ్వేజ్
  • 28 మార్చి 2026 – మాథెమాటిక్స్
  • 02 ఏప్రిల్ 2026 – ఫిజికల్ సైన్స్
  • 07 ఏప్రిల్ 2026 – బయోలాజికల్ సైన్స్
  • 13 ఏప్రిల్ 2026 – సోషల్ స్టడీస్

ప్రతి ఎగ్జామ్ కి దాదాపు నాలుగు రోజుల గ్యాప్ రావడంతో విద్యార్థులకు పండగల ఒత్తిడి ఉండదని అధికారులు చెబుతున్నారు. ఫెస్టివల్ టైమ్ లో ఎక్కువ గ్యాప్ రావడంతో ప్రిపేర్ అవడానికి విద్యార్థులకు సమయం దొరుకుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికారికంగా పరీక్షల షెడ్యుల్ విడుదల చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల DEO లకు, స్కూల్ హెడ్ మాస్టర్ లకి విద్యాశాఖ సమాచారం పంపింది

పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ లతో కో ఆర్డినేట చేసుకొని జిల్లా విద్యా అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల పూర్తి టైం టేబుల్ ఇక్కడ చూడండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.