Tata Memorial Centre Senior Resident Recruitment 2022: టాటా మెమోరియల్ సెంటర్ (TMC Mumbai)కి చెందిన వారణాసిలోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్.. ఫెలోషిప్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 63
పోస్టుల వివరాలు:
విభాగాలు: హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ, హెమటోపాథాలజీ, మెడికల్ ఆంకాలజీ, పల్లియేటివ్ మెడిసిన్, రేడియో డయాగ్నసిస్, సర్జికల్ ఆంకాలజీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.84,000ల నుంచి రూ.1,01,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లో మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: జూన్ 20, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.