భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారత వాతావరణ శాఖలోని.. 990 గ్రూప్ ‘బి’ నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టులైన సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, భౌతికశాస్త్రం/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్స్ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు అక్టోబర్ 18, 2022వ తేదీ నాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 18, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ సారి కేవలం టైర్-I, టైర్-II ద్వారా మాత్రమే అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
రాత పరీక్ష విధానం: పార్ట్ -1, పార్ట్ -2లలో మొత్తం 200 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. 2 గంటల్లో పరీక్ష రాయవల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
పార్ట్-1లో..
జనరల్ ఇంటెలిజన్స్ అండ్ రీజనీంగ్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు
జనరల్ అవేర్‌నెస్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు
క్వాంటిటేవిట్ ఆప్టిట్యూడ్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు
ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి.
పార్ట్-2లో..
ఫిజిక్స్ / కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో 100 మార్కులకు ఉంటుంది. ఈ రెండు విభాగాలకు ఒకేసారి పరీక్ష జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు..
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.