SSC Constable GD Results 2026: కేంద్రంలో 53,690 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. తుది ఫలితాలు వచ్చేశాయ్‌! డైరెక్ట్ లింక్‌

సాయుధ బలగాల్లో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ (ఎస్ఎస్‌సీ) నిర్వహించిన కానిస్టేబుల్‌ జీడీ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు కానిస్టేబుల్‌ జీడీ పరీక్ష తుది ఫలితాలను ఎస్సెస్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్ధులు..

SSC Constable GD Results 2026: కేంద్రంలో 53,690 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. తుది ఫలితాలు వచ్చేశాయ్‌! డైరెక్ట్ లింక్‌
SSC GD Constable Final results

Updated on: Jan 16, 2026 | 6:18 AM

హైదరాబాద్‌, జనవరి 16: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలోని సాయుధ బలగాల్లో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ (ఎస్ఎస్‌సీ) నిర్వహించిన కానిస్టేబుల్‌ జీడీ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు కానిస్టేబుల్‌ జీడీ పరీక్ష తుది ఫలితాలను ఎస్సెస్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా కేంద్ర సాయుధ బలగాలు, ఎస్‌ఏఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌ సహా (బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ, ఏఆర్‌, ఎన్‌సీబీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌) మొత్తం 8 విభాగాల్లో దాదాపు 53,690 కానిస్టేబుల్‌ (జీడీ) పోస్టుల ఎంపికకు ఎస్సెస్సీ ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. గతేడాది నోటిఫికేషన్‌ విడుదలవగా.. వివిధ దశలను దాటుకొని ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలను అధికారులు గురువారం రాత్రి విడుదల చేశారు.

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్‌ (జీడీ) తుది ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇందులో భాగంగా 2025 ఫిబ్రవరి 4 నుంచి 25 వరకు ఆయా తేదీల్లో ఆన్‌లైన్‌ రాత పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా దాదాపు 24 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను గతేడాది జూన్‌ 17న విడుదల అయ్యాయి. ఇందులో 3,94,121 మందిని షార్ట్‌లిస్ట్‌ చేసి రెండో దశ అయిన ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌(PET), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (PST)కు ఎంపిక చేశారు. ఈ పరీక్షలు ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు జరిగాయి. రెండో దశ తర్వాత 95,575 మంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి మూడో దశ అయిన వైద్య పరీక్షలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ వంటి ఇతర ప్రక్రియలను పూర్తి చేసింది. ఇక తాజాగా తుది ఫలితాలను కమిషన్‌ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్టులకు ఎంపికైన మహిళా అభ్యర్థులు, పురుషులు, వివిధ కారణాలతో ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచిన వారి జాబితాలను వేర్వేరుగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పూర్తి వివరాలకు ఈ కింది లింక్‌పై క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి