SSC CPO 2024 Final Results: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ తుది ఫలితాలు విడుదల.. ఎంత మంది సెలక్ట్ అయ్యారంటే

ఢిల్లీ పోలీసు విభాగంలో సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌)లో సబ్ ఇన్‌స్పెక్టర్ నియామక రాత పరీక్ష-2023కు సంబంధించిన తుది ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫలితాలు విడుదల చేసినట్లు ప్రకటించింది. మొత్తం 7046 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. వీరిలో మహిళలు 568 మంది, పురుషులు 568 మంది ఉన్నారు..

SSC CPO 2024 Final Results: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ తుది ఫలితాలు విడుదల.. ఎంత మంది సెలక్ట్ అయ్యారంటే
Staff Selection Commission

Updated on: Apr 07, 2024 | 3:14 PM

ఢిల్లీ, ఏప్రిల్‌ 7: ఢిల్లీ పోలీసు విభాగంలో సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌)లో సబ్ ఇన్‌స్పెక్టర్ నియామక రాత పరీక్ష-2023కు సంబంధించిన తుది ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫలితాలు విడుదల చేసినట్లు ప్రకటించింది. మొత్తం 7046 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. వీరిలో మహిళలు 568 మంది, పురుషులు 568 మంది ఉన్నారు. వీరందరికీ త్వరలో శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ నియామక రాత పరీక్ష ద్వారా కేంద్ర సాయుధ బలగాలలో అంటే సీఏపీఎఫ్‌ బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీతోపాటు ఢిల్లీ పోలీసు విభాగంలో 1876 సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పేపర్‌-1, 2 రాత పరీక్షలు, శారీరక దారుఢ్య పరీక్షలు (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, తదితరాల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అన్ని దశల్లో ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్- ఎస్సై తుది ఫలితాలు లిస్ట్‌ – 1 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ఇవి కూడా చదవండి

స్టాఫ్ సెలక్షన్ కమిషన్- ఎస్సై తుది ఫలితాలు లిస్ట్‌ – 2 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

తెలంగాణ: ఏప్రిల్‌ 7 న‘ఆదర్శ’ పాఠశాలల్లో ప్రవేశపరీక్ష

తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లాలోని మూడు ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఏప్రిల్ 7వ తేదీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు హనుమకొండ డీఈవో ఎండీ అబ్దుల్‌ హై తెలిపారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దరఖాస్తుకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఆరో తరగతి విద్యార్ధులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఏడో తరగతి నుంచి పదో తరగతి విద్యార్ధులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.