Railway News: ఆర్‌ఆర్‌బీ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. ఏకంగా 65 ప్రత్యేక రైళ్ల ఏర్పాటు..

|

May 06, 2022 | 12:27 PM

Railway News: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. ఉద్యోగార్థుల సౌలభ్యం కోసం ఏకంగా 65 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు...

Railway News: ఆర్‌ఆర్‌బీ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. ఏకంగా 65 ప్రత్యేక రైళ్ల ఏర్పాటు..
Special Trains
Image Credit source: TV9 Telugu
Follow us on

Railway News: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. ఉద్యోగార్థుల సౌలభ్యం కోసం ఏకంగా 65 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. అయితే ఈ రైళ్లకు ఎలాంటి రాయితీలు ఉండవని, ప్రత్యేక రైళ్ల రుసుమును మొత్తం చెల్లించాలని తెలిపారు. ఈ రైళ్ల ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా మేలు జరగనుంది.

ముఖ్యంగా హైదరాబాద్‌-మైసూర్‌, మైసూర్‌ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌-విశాఖపట్నం, విశాఖపట్నం-సికింద్రాబాద్‌, కాకినాడ-కర్నూలు, కర్నూలు-కాకినాడ, మచిలీపట్నం-ఎర్నకులం, కడప – విశాఖపట్నం, విశాఖటప్నం-కడప రూట్‌లలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు కాకినాడ-కర్నూలు, కడప-రాజమహేంద్రవరం, కాకినాడ-మైసూరు, కర్నూలు-మైసూరు, నర్సాపురం-సికింద్రాబాద్‌, విజయవాడ-నాగర్‌సోల్‌, షాలీమార్‌-విజయవాడ, హటియా-విజయవాడ, నర్సాపురం-త్రివేండ్రం వంటి ప్రత్యేక రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి.

మే 8వ తేదీని ఎక్కువ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఏయే సమయాల్లో బయలు దేరనున్నాయి, గమ్య స్థానానికి ఏ సమయానికి చేరుకోనున్నాయి. లాంటి పూర్తి వివరాల కోసం కింద ఉన్న లింక్‌ను క్లిక్‌ చేయండి..

ప్రత్యేక రైళ్ల పూర్తి వివరాలు..

Also Read: AIIMS Recruitment: తెలంగాణ బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

America: సింగిల్ డోస్ అని ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారా.. రక్తం గడ్డ కడుతుందని యూఎస్ ఎఫ్‌డీఏ హెచ్చరిక

ఈ వ్యక్తి క్రియేటివిటీ మాములుగా లేదుగా !! రేస్‌ కార్‌లో వెళ్లి పాలు పోస్తున్న పాలవ్యాపారి