SAIL Durgapur Proficiency Training of Nurses Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన (SAIL) పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ (Durgapur Steel Plant).. 56 ప్రొఫీషియన్సీ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ కింద ఐసీయూ, ఎన్‌ఐసీయూ, బీఐసీయూ, మెడిసిన్, సర్జరీ, ఓ అండ్ జీ, పీడియాట్రిక్స్, క్యాజువాలిటీ, ఆర్థోపెడిక్స్, కొవిడ్, చెస్ట్ తదితర విభాగాల్లోని పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ(నర్సింగ్)/డిప్లొమా(జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ) కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు చేసుకునే వారి వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 29లోపు దరఖాస్తులను ఈ మెయిల్ rectt.dsp@sail.inకు పంపించాలి. కింది అడ్రస్‌లో ఆగస్టు 30, 31 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.8000ల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు.
అడ్రస్: DSP Main Hospital, J.M. Sengupta Road, B-Zone, Durgapur-713205.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.