Railway Jobs 2025: ఇంటర్ అర్హతతో భారీగా రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎంపికైతే లైఫ్ సెటిలంతే!

RRB NTPC Undergraduate Recruitment 2025 Notification Out For 3058 Posts: సికింద్రాబాద్ సహా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న నాన్‌టెక్నికల్ పాపులర్‌ కేటగిరీస్‌కి చెందిన అండర్‌ గ్యాడ్యుయేట్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్‌..

Railway Jobs 2025: ఇంటర్ అర్హతతో భారీగా రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎంపికైతే లైఫ్ సెటిలంతే!
RRB NTPC Undergraduate Railway Jobs

Updated on: Oct 28, 2025 | 2:30 PM

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న నాన్‌టెక్నికల్ పాపులర్‌ కేటగిరీస్‌కి చెందిన అండర్‌ గ్యాడ్యుయేట్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 3,058 కమర్షియల్ కమ్‌ టికెట్‌ క్లర్క్‌, అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, జూనియర్ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, ట్రైన్స్‌ క్లర్క్‌ పోస్టులను భర్తీచేయనుంది. ఇంటర్మీడియట్‌ అర్హత కలిగిన అభ్యర్ధులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు అక్టోబర్‌ 28, 2025వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు ఇవే..

  • కమర్షియల్ కమ్‌ టికెట్‌ క్లర్క్‌ పోస్టుల సంఖ్య: 2,424
  • అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టుల సంఖ్య: 394
  • జూనియర్ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టుల సంఖ్య: 163
  • ట్రైన్స్‌ క్లర్క్‌ పోస్టుల సంఖ్య: 77

ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 27, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, పీడబ్ల్యూబీడీ, మహిళా, ట్రాన్స్‌ జెండర్‌, మైనార్టీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా తుది పెంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు కామెరికల్ కమ్‌ టికెట్‌ క్లర్క్‌ పోస్టులకు రూ.21,700, అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టులకు రూ.19,900, జూనియర్ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టులకు రూ.19,900, ట్రైన్స్‌ క్లర్క్‌ పోస్టులకు రూ.19,900 చొప్పున జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు కల్పిస్తారు.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • దరఖాస్తులకు ప్రారంభ తేదీ: అక్టోబర్‌ 28, 2025.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: నవంబర్‌ 27, 2025.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: నవంబర్‌ 29, 2025.
  • దరఖాస్తు సవరణ తేదీలు: నవంబర్‌ 30వ తేదీ నుంచి డిసెంబర్‌ 12 వరకు

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.