RBI Recruitment 2026: రిజర్వ్ బ్యాంక్‌లో ఉద్యోగాల జాతర.. వెంటనే దరఖాస్తు చేసుకోండి

ప్రతిష్టాత్మక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు జులై 6లోపు అప్లై చేసుకోవాలి. బ్యాంకింగ్, టెక్నాలజీ, పాలసీ రీసెర్చ్ రంగాల్లో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే వారికి ఆర్‌బీఐ మంచి అవకాశం కల్పిస్తోంది..

RBI Recruitment 2026: రిజర్వ్ బ్యాంక్‌లో ఉద్యోగాల జాతర.. వెంటనే దరఖాస్తు చేసుకోండి
RBI Young Professionals Recruitment

Updated on: Jun 21, 2026 | 7:03 AM

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద 12 యంగ్‌ ప్రొఫెషనల్స్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 6, 2026వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రిస్క్‌, పాలసీ అనాలిటిక్స్‌, క్లైమేట్‌ చేంజ్‌ రిస్క్‌ అండ్‌ సస్టేయినబుల్‌ ఫైనాన్స్‌, క్రేడిట్‌ రిస్క్‌ అనలిటిక్స్‌ అండ్‌ రెగ్యులేటరీ పాలసీ, పేమెంట్‌ ఎకోసిస్టమ్‌, పాలసీ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌ డొమెస్టిక్‌ అండ్‌ క్రాస్‌బోర్డర్‌ పేమెంట్‌ సిస్టమ్‌, పాలసీ అండ్‌ రిసెర్చ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, క్వాంటమ్‌ టెక్నాలజీ, డేటా అనాలసిస్‌, ఫైనాన్షియల్‌ మార్కెట్‌, డేటా అనలిటిక్స్‌ అండ్‌ పాలసీ రిసెర్చ్‌.. తదితర విభాగాల్లో భర్తీ చేయనున్నారు.

భారతీయ రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్యాంకింగ్, ఫైనాన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి కీలక రంగాల్లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగాన్ని బట్టి సీఏ, బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి అప్లికేషన్‌ చివరి తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జులై 6, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులను స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను yphrmdco@rbi.org.in ఈమెయిల్ ద్వారా పంపాలి. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెక్నాలజీ రంగాల్లో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే యువ నిపుణులకు ఆర్‌బీఐ తాజా నియామకాలు మంచి అవకాశంగా చెప్పవచ్చు.

భారతీయ రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us