Reliance Jio: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రిలయన్స్ జియోలో భారీగా ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?

|

Apr 12, 2021 | 6:56 AM

Reliance Jio Jobs: రిలయన్స్ జియోలో పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఆ సంస్థ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు

Reliance Jio: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రిలయన్స్ జియోలో భారీగా ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?
reliance jio jobs
Follow us on

Reliance Jio Jobs: రిలయన్స్ జియోలో పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఆ సంస్థ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు రిలయన్స్ ముంబై లొకేషన్‌ కేంద్రంగా బీటెక్ / బీఈ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే వారు 2019, 2020 బ్యాచ్‌ల నుంచి ఐటి, సీఎస్, ఈసీఈ, ఈఈఈ, టెలికాంలలో డిగ్రీ పొంది ఉండాలి. ఈ అర్హత ఉన్నవారేవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ముందుగా ట్రైనీలుగా తీసుకోని.. ఆ తర్వాత పర్మినెంట్ చేయనున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు..

గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ | ముంబై

● అనుభవం – 0-1 సంవత్సరం
● అర్హత – బీ.టెక్ / బీఈ – 2019, 2020 బ్యాచ్‌ల నుంచి ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్ / కంప్యూటర్స్ / టెలికాం ఇంజనీరింగ్ చేసి ఉండాలి

స్కిల్స్..

● టీమ్ లీడర్
● విశ్లేషణాత్మక నైపుణ్యాలు
● సమాచార నైపుణ్యాలు
● నెట్‌వర్క్ పరిజ్ఞానం
● 2 జీ, 3 జీ, 4 జీ నెట్‌వర్క్ పరిజ్ఞానం
● వ్యాపార నైపుణ్యాలు..

ఉద్యోగ వివరాలు

● గ్లోబల్ రోమింగ్‌ను ప్రారంభించడానికి సాంకేతిక అవసరాలు, డిజైన్లను రూపొందించడం. అకౌంటింగ్, గుర్తింపు, ప్రమాణీకరణ, పని నిర్వహణ
● 2G, 3G, 4G రోమింగ్ సామర్థ్యాలకు సంబంధించిన ప్రణాళికలు, ఉత్పత్తి పరికర బృందంతో సమన్వయం చేయాల్సి ఉంటుంది.
● నెట్‌వర్క్, పనితీరును విశ్లేషించడం.. వాటిని పరిష్కరించడం
● అంతర్జాతీయ నెట్‌వర్క్‌ల రూపకల్పన, ప్రణాళిక
● సేవలు తదితర విషయాలను అనలైజ్ చేయడం
● కొత్త నవీకరణలు / నెట్‌వర్క్ విస్తరణ / పెట్టుబడుల కోసం సాంకేతిక స్థాయి ప్రతిపాదనల తయారీకి రూపకల్పన చేయడం
● సమస్యలను గుర్తించడం, వాటి మెరుగుదల, పరిష్కారం కోసం సిఫార్సులు చేయడం

 

Also Read:

Gold Price Today : స్వల్పంగా దిగి వచ్చిన బంగారం ధరలు… దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి

Maruti Suzuki: మారుతి సుజుకీ కార్లపై భారీ ఆఫర్లు.. రూ.57 వేల వరకు తగ్గింపు.. మరిన్ని ప్రయోజనాలు