Port Trust Jobs: విశాఖపట్నంలోని పోర్ట్ అథారిటీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజనీరింగ్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఇంజనీరింగ్ సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సివిల్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్/డీసీఈ ఉత్తీర్ణతో పాటు పనిలో అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అభ్యర్థులను పని అనుభవం, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 35,000 జీతంగా చెల్లిస్తారు.
* వాన్ ఇన్ ఇంటర్వ్యూలను 20-04-2022న చీఫ్ ఇంజనీర్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం, మూడో అంతస్తు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, విశాఖపట్నం, ఏపీ అడ్రస్‌లో నిర్వహిస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Aadhaar History: మీరు ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఇలా చేయండి
Mobile Theatre: ఏపీలో మొదటి మొబైల్ సినిమా థియేటర్.. ఎక్కడో తెలుసా..