Fact Check: ఒకప్పుడు ఏదైనా వార్తను ప్రజలకు తెలియజేయాలంటే వార్త పత్రికలు లేదా టీవీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రభుత్వాలు కూడా తమ పథకాలను ప్రచారం చేసుకోవడానికి కూడా వీటినే ఆశ్రయించేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చిన తర్వాత సమూల మార్పులు వచ్చాయి. ప్రభుత్వాలను అందిస్తోన్న సంక్షేమ పథకాలు, తీసుకుంటున్న నిర్ణయాలను సైతం సామాజిక మాధ్యమాల ద్వారానే ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే దీనినే ఆసరాగా తీసుకొని కొందరు నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు ప్రకటించని పథకాలను సైతం ఉన్నట్లు ఫేక్ మెసేజ్‌లను రూపొందిస్తూ, లింక్‌లతో గాలం వేస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. ఈ మెసేజ్‌లో వివరాలు ఇలా ఉన్నాయి.. ‘దేశంలోని విద్యార్థులందరికీ ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లను అందిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌లను పొందడానికి మీ ఫోన్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోండి’ అంటూ ఓ లింక్‌ను వైరల్ చేస్తున్నారు. అయితే దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఓ అధికారిక ప్రకటన చేసింది. సదరు ఫేక్ మెసేజ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. ‘వైరల్ అవుతోన్న ఈ సమాచారం పూర్తిగా ఫేక్. ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని దేనిని అమలు చేయడం లేదు’ అంటూ ట్వీట్ చేశారు. చూశారుగా మీరు కూడా ఇలాంటి మోసపూరిత మెసేజ్‌లకు వీలైనంత వరకు దూరంగా ఉండండి, అనవసరంగా నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకండి.
A text message with a website link is circulating with a claim that the Government of India is offering free laptops for all students. #PIBFactCheck:
▶️The circulated link is #Fake.
▶️The government is not running any such scheme. pic.twitter.com/OkYDOY8ns5
— PIB Fact Check (@PIBFactCheck) April 25, 2022
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: ఐపీఎల్ పై అమీర్‌ఖాన్ ఎం అన్నారు అంటే..
Drugs: పాకిస్తాన్ నుంచి భారత్‌కు డ్రగ్స్.. గుజరాత్ తీరంలో రూ.280 కోట్ల హెరాయిన్ పట్టివేత..
Drugs: పాకిస్తాన్ నుంచి భారత్‌కు డ్రగ్స్.. గుజరాత్ తీరంలో రూ.280 కోట్ల హెరాయిన్ పట్టివేత..