ONGC Rajahmundry Medical Officer Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC)కి చెందిన రాజమండ్రి యూనిట్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టులు: 30
పోస్టులు: మెడికల్ ఆఫీసర్ (ఫీల్డ్ డ్యూటీ, ఆక్యుపేషనల్ హెల్త్, జనరల్ డ్యూటీ) పోస్టులు
విభాగాలు: ఫిజీషియన్, పీడియాట్రీషియన్, జనరల్ సర్జన్, పాథాలజీ, గైనకాలజీ, హోమియోపతి తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు ఎంతైనా ఉండవచ్చు.
పే స్కేల్: నెలకు రూ. 50,000ల నుంచి రూ.1,05,000ల వరకు చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సెంట్రల్ మెడికల్ కౌన్సిల్/స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం సూచించిన డాక్యుమెంట్లను ఈ కింది ఈ మెయిల్‌కు పంపించాలి.
ఈ మెయిల్ ఐడీ: rjycontractmedics@ongc.co.in
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 12, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.