ONGC Kakinada Medical Officer Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC)కి చెందిన కాకినాడ యూనిట్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టులు: 7
పోస్టులు: మెడికల్ ఆఫీసర్ (ఫీల్డ్ డ్యూటీ, ఆక్యుపేషనల్ హెల్త్) పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు ఎంతైనా ఉండవచ్చు.
పే స్కేల్: నెలకు రూ. 1,00,000ల నుంచి రూ.1,05,000ల వరకు చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సెంట్రల్ మెడికల్ కౌన్సిల్/స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: Oil and Natural Gas Corporation Limited, EOA & HPHT, Kakinada.
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 23, 2022 ఉదయం 10 గంటలు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.