NIT Warangal Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! నెలకు రూ.60 వేల జీతంతో వరంగల్‌ నిట్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ..

|

Jul 31, 2022 | 5:17 PM

భారత ప్రభుత్వ రంగానికి చెందిన వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT Warangal).. తాత్కాలిక ప్రాతిపదికన అడ్‌హక్‌ ఫ్యాకల్టీ, ప్రాజెక్ట్ అసోసియేట్/ప్రోగ్రామర్ తదితర పోస్టుల భర్తీకి..

NIT Warangal Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! నెలకు రూ.60 వేల జీతంతో వరంగల్‌ నిట్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ..
Nit Warangal
Follow us on

NIT Warangal Adhoc Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT Warangal).. తాత్కాలిక ప్రాతిపదికన అడ్‌హక్‌ ఫ్యాకల్టీ, ప్రాజెక్ట్ అసోసియేట్/ప్రోగ్రామర్, జూనియర్ రిసెర్చ్ ఫెలో, అడ్‌హక్‌ ఫ్యాకల్టీ (కెమికల్ ఇంజినీరింగ్, సిస్టమ్స్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంటెక్ (సీఎస్‌ఈ/సీఎస్‌ఐఎస్/ఐటీ) లేదా పీహెచ్‌డీ (సీఎస్‌ఈ), బీఈ, బీటెక్‌ (సీఎస్‌ఈ, ఐటీ) లేదా ఎంసీఏ, ఎంఈ, ఎంఎస్సీ/ఎంఎస్సీ, ఎంటెక్‌ (ఫిజిక్స్/ఇంజినీరింగ్ ఫిజిక్స్/ఫొటోనిక్స్‌) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు ఎవరైన ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగినవారు పోస్టును బట్టి సంబంధిత ఈ మెయిల్‌కు sangu@nitw.ac.in, sroy@nitw.ac.in, chemical_hod@nitw.ac.in, maths_hod@nitw.ac.inకు తమ దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. ఆగస్టు 12, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.31,000ల నుంచి రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.