NFSU Faculty and Non Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన గుజరాత్ (గాంధీనగర్)లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (NFSU).. టీచింగ్, నాన్ టీచింగ్ (Teaching and Non Teaching Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 332
పోస్టుల వివరాలు:
ఖాళీల వివరాలు:
ప్రొఫెసర్ పోస్టులు: 28
అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు: 49
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 116
విభాగాలు: ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్‌ప్రింట్ సైన్స్, ఫోరెన్సిక్ మెడిసిన్, నానో టెక్నాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే టీచింగ్ అనుభవం కూడా ఉండాలి.
పోస్టుల వివరాలు: కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఫైనాన్స్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్, అకౌంటెంట్ కమ్ ఆడిటర్, ఐటీ సిస్టమ్ మేనేజర్, అసిస్టెంట్ తదితర విభాగాలు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, పీజీలో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 21, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: