NEIGRIHMS Recruitment 2022: నైగ్రిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్షలేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

|

Nov 15, 2022 | 7:53 AM

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన మేఘాలయలోని షిల్లాంగ్‌లోనున్న నైగ్రిమ్స్‌ (NEIGRIHMS Shillong).. ఒప్పంద ప్రాతిపదికన 50 సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ (Senior Resident Doctor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

NEIGRIHMS Recruitment 2022: నైగ్రిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్షలేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
NEIGRIHMS Recruitment 2022
Follow us on

NEIGRIHMS Shillong Senior Resident Doctor Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన మేఘాలయలోని షిల్లాంగ్‌లోనున్న నైగ్రిమ్స్‌ (NEIGRIHMS Shillong).. ఒప్పంద ప్రాతిపదికన 50 సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ (Senior Resident Doctor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనాటమీ, కార్డియాలజీ, సీటీవీఎస్‌, జనరల్‌ సర్జరీ, మైక్రోబయోలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, రేడియోథెరపీ, యూరాలజీ, అనెస్థీషియా, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, ఆప్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్స్‌, పాథాలజీ, ఫార్మకాలజీ, సర్జికల్‌ అంకాలజీ తదితర విభాగాల్లోని ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్‌, హౌస్‌మ్యాన్‌షిప్‌ కూడా పూర్తి చేసి ఉండాలి. స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ లేదా మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్న వారు సంబంధిత డాక్యుమెంట్లతో కింది అడ్రస్‌లో సెప్టెంబర్‌ 26 నుంచి 29 వరకు నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.67,700ల వరకు జీతంతోపాటు, ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: Conference Hall, NEIGRIHMS Guest House, Permanent Campus, Mawdiangdiang, Shillong-793018.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.