NCRA Recruitment 2022: నెలకు రూ.78500ల జీతం.. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రేడియో ఆస్ట్రోఫిజిక్స్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..

|

May 08, 2022 | 7:32 PM

భారత ప్రభుత్వ రంగానికి చెందిన పుణెలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌కు చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రేడియో ఆస్ట్రోఫిజిక్స్‌ (NCRA).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ (Project Engineer Posts) పోస్టుల భర్తీకి..

NCRA Recruitment 2022: నెలకు రూ.78500ల జీతం.. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రేడియో ఆస్ట్రోఫిజిక్స్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..
Ncra
Follow us on

NCRA Project Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన పుణెలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌కు చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రేడియో ఆస్ట్రోఫిజిక్స్‌ (NCRA).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ (Project Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 14

పోస్టుల వివరాలు:

  • ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు: 1
  • ఇంజనీర్‌ ట్రైనీలు (సర్వో, డిజిటల్‌) పోస్టులు: 3
  • టెక్నికల్‌ ట్రైనీ (ఎటక్ట్రికల్‌) పోస్టులు: 1
  • అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైనీ పోస్టులు: 9

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించకుండా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.78,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్‌టెస్ట్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NEET PG 2022 Exam date: నీట్‌ పీజీ వాయిదా పడిందంటూ నెట్టింట ఫేక్‌ న్యూస్! క్లారిటీ ఇచ్చిన కేంద్రం..