NCERT Survey Associate Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)కి చెందిన ఎడ్యుకేషన్ సర్వే విభాగంలో భాగంగా.. ఒప్పంద ప్రాతిపదికన సర్వే అసోసియేట్, కంప్యూటర్ అసిస్టెంట్ తదితర పోస్టుల (Survey Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీలు: 5
పోస్టుల వివరాలు: సర్వే అసోసియేట్, కంప్యూటర్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అకౌంటెంట్, ఎంటీఎస్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.20,000ల నుంచి రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సైన్స్/ స్టాటిస్టిక్స్/ మ్యాథ్స్/ ఎడ్యుకేషన్ స్పెషలైజేషన్‌లో పీజీ, బ్యాచిలర్స్ డిగ్రీలో లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. కంప్యూటర్ , టైపింగ్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ మెయిల్ ఐడీ: lepesd2023@gmail.com
దరఖాస్తులకు చివరి తేదీ: మే 27, 2022న విడుదలైన ప్రకటన తేదీ నుంచి సరిగ్గా 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.