National Book Trust Jobs 2022: నెలకు రూ.60,000ల జీతంతో నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాలు..ఇంటర్వ్యూ ద్వారా..

|

Apr 13, 2022 | 6:10 PM

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ (NBT).. ఒప్పంద ప్రాతిపదికన ఐటీ ప్రోగ్రామర్‌, ఎడిటోరియల్‌ అసిస్టెంట్‌ పోస్టుల (IT Programmer Posts) భర్తీకి అర్హులైన..

National Book Trust Jobs 2022: నెలకు రూ.60,000ల జీతంతో నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాలు..ఇంటర్వ్యూ ద్వారా..
Nbt
Follow us on

National Book Trust Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ (NBT).. ఒప్పంద ప్రాతిపదికన ఐటీ ప్రోగ్రామర్‌, ఎడిటోరియల్‌ అసిస్టెంట్‌ పోస్టుల (IT Programmer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

పోస్టుల వివరాలు: ఐటీ ప్రోగ్రామర్‌, ఎడిటోరియల్‌ అసిస్టెంట్‌, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు 25,000ల నుంచి రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, బీసీఏ/బీఎస్సీ కంప్యూటర్స్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: The Deputy Director (Estt. & Admn,) National Book Trust, India Nehru Bhawan, 5, Institutional Area, Phase-ll, Vasant Kunj, New Delhi-110070.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 18, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NPCIL Recruitment 2022: గేట్‌ స్కోర్‌ ద్వారా ఎంపిక.. న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో 225 ఉద్యోగాలు..