NIH Roorkee Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌! నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రోలజీ సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం

|

Sep 05, 2022 | 8:45 AM

భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రోలజీ (NIH Roorkee).. 18 సైంటిస్ట్ (Scientist Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

NIH Roorkee Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌! నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రోలజీ సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం
Nih Roorkee
Follow us on

NIH Roorkee Scientist Recruitment 2022: భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రోలజీ (NIH Roorkee).. 18 సైంటిస్ట్ (Scientist Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఇంజనీరింగ్‌లో సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్హతలతోపాటు అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 20, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.2000లు, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులు రూ.1000లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించినవారికి నెలకు రూ.56,000 నుంచి రూ.2,16,600 వ‌ర‌కు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: Senior Administrative Officer, National Institute of Hydrology, Roorkee – 247667 (Uttarakhand), India.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.