NEET Application: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(National Eligibility Cum Entrance Test) పరీక్ష దరఖాస్తు గడువును పెంచారు. అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ వరకు నీట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా, నీట్ దరఖాస్తుల ప్రక్రియ జులై 13వ తేదీన ప్రారంభం అవగా.. ఆగస్టు 6వ తేదీని చివరి తేదీగా ప్రకటించారు. అయితే, కరోనా నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో గడువు పెంచాల్సిందిగా విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. నీట్ గడువును మరో నాలుగు రోజులు పెంచింది. ఇప్పటి వరకు నీట్‌కు దరఖాస్తు చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్‌టీఏ అధికారులు సూచించారు.
బీఎస్సీ నర్సింగ్‌కి నీట్‌లో అర్హత సాధించాల్సిందే..
బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలంటే నీట్‌లో అర్హత సాధించాల్సిందే అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సిఫారసుల మేరకు బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ పరీక్ష తప్పకుండా రాయాలన్నారు. నీట్ అర్హత ఆధారంగానే బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలకు అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
Also read: